Home | TAGDV Events | Feedback
We strive to promote Telugu language & culture among our youth and try our involve them the best we can
Event Photos

Diwali 2011

More Events
President's Message
 

అధ్యక్షుని లేఖ - మీ సేవలో టిఏజిడివి

నలబైమూడు సంవత్సరాల గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘము (టిఏజిడివి) సభ్యులుకు, తెలుగు భాషాభిమానులకు , శ్రేయోభిలాషులకు శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! 

మన తెలుగు వారందరి తర తరాల సంస్కృతిని గుర్తుకు తెచ్చుకుంటూ, ఈ సంవత్సరం కూడా ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాము. మన అందరికీ సుపరిచితమైన ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం లాంటి వేడుకలతో, ఏ పండుగకు లేని ప్రత్యేకత ఉగాదికి ఉంది. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే కష్ట-సుఖాలను, ఒడిదుడుకులను సమంగా స్వీకరించాలన్న సందేశంతో పాటు, ఋతు మార్పు కారణంగా వచ్చే కోయిల రాగాల ఆనందం, పువ్వుల పలకరింపుల సంతోషం, వేప చేదులో వైరాగ్యం, మామిడి ఒగరులో వయ్యారం, చెరుకు రసం లో ఆప్యాయత, చింత చిగురులో చమత్కారం, పచ్చి మిర్చి లో కోపం అన్ని కలగలిసి దోషాలను హరించే దివ్య ఔషధంగా కూడా షడ్రుచుల ఉగాది పచ్చడి సహాయపడుతుంది.

పుట్టిన భూమికి దూరంగా ఉన్నాము కాని సంప్రదాయాలకు కాదు అని మన పిల్లల తరాలకు కూడా అవి అందించే ప్రయత్నమే మనము జరుపుకొనే పండుగవేడుకల ఉద్దేశం. అందువలన మీరందరూ మేము నిర్వహించే అన్ని ఉత్సవాలకు కుటుంబ మరియు సహచరుల సమేతంగా విచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాలను చూసి ఆనందించాలని మా కార్యనిర్వాహక సభ్యుల కోరిక.

మారుతున్న మన సభ్యుల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఏ సంస్థ మనుగడకైనా ధనమే ప్రధాన ఇంధనం. గడచిన నాలుగు దశాబ్దాల పాటు ఎందరో పోషకుల దాతృత్వం తోనే టిఏజిడివి జనరంజకమైన కార్యక్రమాలు మీ ముందుకు తీసుకు రాగలిగింది. మన పోషక దాతల వాణిజ్య సంస్థలకు, వ్యక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు.

అభినందనలతో...

 

మీ

హరినాథ్ బుంగటావుల.

 

 
 
Home | Leadership | President's Message | Past Presidents | Committees | Youth | Music | Sponsors | TAGDV Events | Membership | Life Members | Forms | Telugu Vani | Links | Feedback
Copyright 2010 To contact us please send email to